చిరు సినిమాలో అక్షయ్‌కుమార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 151వ సినిమాకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ చివరలో సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ప్రముఖ రచయితలూ పరుచూరి బ్రదర్స కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తాడని తెలిసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే ఈ సినిమాలో అక్షయ్ పాత్ర ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే అక్షయ్‌తో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. అతడు కూడా తెలుగులో నటించాలన్న ఆసక్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ వస్తే ఆయన ఎందుకు కాదంటాడు చెప్పండి? ‘ఖైదీ నంబర్ 150’తో భారీ వసూళ్లు రాబట్టి సత్తా చాటిన చిరంజీవి మరి ఈ స్వతంత్ర సమరయోధుడిగా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి!!