చేనేతకు విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్ కథానాయకుడుగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం శుక్రవారం విడుదలై తొలి రోజు కలక్షన్లను గత చిత్రాలన్నిటి రికార్డులన్నిటినీ అధిగమించి నెం.1 స్థానంలో కొనసాగుతోందని దర్శకుడు డాలి తెలియజేశారు. బాక్సాఫీస్‌వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఆదివారం ఉదయం తెలంగాణ ఐటి, పురపాలక శాఖామంత్రి కెటిఆర్ కాటమరాయుడు చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌కల్యాణ్‌తో సెల్ఫీలు దిగి, అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం ద్వారా చేనేత మగ్గాలపై నేసిన వస్త్రాలకు మంచి ప్రచారం లభించిందని, ఇలా ప్రతి చిత్రంలో కూడా కుటీర పరిశ్రమలకు వెన్నుదన్నుగా ఉండేలా సన్నివేశాల చిత్రీకరణ, పాటల చిత్రీకరణ జరపాలని, అలాచేయడంవల్ల అందరికీ ఆనంద దాయకమేకాక, ఆయా కుటీర పరిశ్రమలకు ఊపిరినిచ్చినట్లుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈ సినిమా చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. అన్ని కేంద్రాలలో కాటమరాయుడు బాక్సాఫీసు కలక్షన్లను రాబడుతున్న విధానాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు.