వీడెవడు టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచిన్, ఇషాగుప్తా జంటగా కింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తాతినేని సత్య దర్శకత్వంలో రైనాజోషి రూపొందించిన చిత్రం ‘వీడెవడు’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రవీందర్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని సత్య తెరకెక్కించిన తీరు ఆసక్తి కలిగిస్తుందని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన తాను ‘వీడెవడు’ సినిమాలో కీలక పాత్రలో నటించానని, మంచి కథతో రూపొందించిన ఈ సినిమా హైలీ బడ్జెట్‌తో తెరకెక్కించారని నటుడు సాజిడిసౌజా తెలిపారు. ఎస్.ఎం.ఎస్, భీమిలీ కబడ్డీ జట్టు, శంకర చిత్రాలు రీమేక్‌లుగా చేసిన తాను వీడెవడు చిత్రాన్ని స్ట్రయిట్ చిత్రంగా నిర్మించే ప్రయత్నం చేశానని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే నెలాఖరుకు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తాతినేని సత్య అన్నారు. ఔట్‌పుట్ బాగా వచ్చిందని, టీజర్ అందరికీ నచ్చిందని, సినిమా కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని కథానాయకుడు సచిన్ అన్నారు. కార్యక్రమంలో రఘు కులకర్ణి, శివప్రసాద్ గుడిమిట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: బీనేంద్ర మీనన్, దర్శకత్వం: తాతినేని సత్య.