అలా చెయొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ భామ దీపికాపదుకొనే ప్రస్తుతం ‘పద్మావతి’ చిత్రంలో నటిస్తోంది. చారిత్రాత్మక కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ లీలాబన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాణి పద్మావతిగా నటిస్తున్న దీపికకు దర్శకుడు బన్సాలీ ఓ షరతు పెట్టాడని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తయ్యేవరకు రణవీర్‌తో కలవవద్దని, బహిరంగంగా చెట్టపట్టాలువేసుకుని తిరగవద్దని హెచ్చరించాడని తెలిసింది. ఇద్దరూ చాలాకాలంగా ఘాటు ప్రేమాయణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి వ్యవహారం బాలీవుడ్‌లో జోరుగా ప్రచారంలో ఉంది. రణవీర్ కూడా ‘పద్మావతి’ చిత్రంలో నటిస్తున్నారట. అయితే షూటింగ్ లొకేషన్‌లో ఇద్దరూ కలసి ఒకే దగ్గర కనిపించొద్దని, ఇద్దరు కలిస ఏ ఫంక్షన్లకు వెళ్లవద్దని ఆర్డర్ వేశాడట దర్శకుడు. కానీ కన్నుగప్పి ఓ ఫంక్షన్‌కు చెక్కేయాలని ప్లాన్ వేశారట. ఇది తెలిసిన బన్సాలీ ఈ రూల్ పాస్ చేశాడని, యూనిట్ గుసగుసలాడుతోంది. అయితే దర్శకుడి ఆర్డర్‌ను దీపిక పాటిస్తుందో లేదో చూడాలి!