అందరికీ నచ్చేలా పిశాచి-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై అందిస్తున్న పిశాచి-2 ప్లాటినం డిస్క్ వేడుక ప్రసాద్ లాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్ ట్రైలర్‌ను, మల్కాపురం శివకుమార్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను వేణుగోపాలాచారి ఆవిష్కరించారు. వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. కన్నడంలో సూపర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో ‘పిశాచి-2’గా విడుదల చేస్తున్నారని, ఇప్పుడు హారర్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. కన్నడంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్న మంచి కథాంశంతో రూపొందిన మంచి సినిమా అవుతుందన్న నమ్మకముందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెన్సార్ సభ్యులు అట్లూరి రామకృష్ణ, ‘పిశాచి-2’లో నటించిన నాగేశ్వరరావు, హీరో రోపేష్, హీరోయిన్ సిప్రాగౌర్, బల్లెం వేణుమాధవ్, కృష్ణమోహన్, కర్పూరం వెంకటేశ్వర్లు, సిరాజ్, దర్శకుడు వీరభద్రచౌదరి, జేవీర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సాయి వెంకట్ తెలిపారు.