నాగ్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఉగాది పండగ రోజున ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ టైటిల్‌ని ఖరారు చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి రెండు పోస్టర్స్‌ను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల చిత్ర విశేషాలను తెలియజేస్తూ- ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ చివరి వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో మరో భారీ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాగచైతన్య కెరీర్‌లో ఇది ఓ మెమరబుల్ మూవీ అవుతుంది. దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్న చిత్రమిది అన్నారు. రకుల్ ప్రీత్‌సింగ్, జగపతిబాబు, సంపత్, కౌసల్య, ఇర్షాద్, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్, ఇష్క్ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫి: ఎస్.వి.విశే్వశ్వరన్, ఎడిటింగ్: గౌతంరాజు, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, శ్రీమణి, డాన్స్: రాజు సుందరం, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.