సమ్మర్ స్పెషల్‌గా వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.జె.సినిమాస్ బేనర్‌పై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వైశాఖం’. మహేష్ చేతుల మీదుగా ఈ నెల 16న రిలీజ్ చేసిన ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ- సూపర్‌స్టార్ చేతుల మీదుగా విడుదలైన మా వైశాఖం ఆడియోకి రెస్పాన్స్ చాలా వస్తోంది. పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ‘్భనుమతి.. భానుమతి’, ‘కమాన్ కంట్రీ చిలకా’, ‘ప్రార్థిస్తానే..’ వైశాఖం టైటిల్ సాంగ్.. ఇలా అన్ని పాటలూ సూపర్‌హిట్ అయ్యాయి. ఇది యూత్‌కి, మాస్‌కి, ఫ్యామిలీస్‌కి, అందరికీ నచ్చే యూనివర్సల్ సబ్జెక్ట్. మా బేనర్‌లో వైశాఖం మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ అవుతుంది అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ- బి.ఎ.రాజు- జయ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా హిట్ అయ్యాయి. వాటన్నింటికన్నా ఈ సినిమా హిట్ అవుతుంది. త్వరలో సినిమాకు సంబంధించిన ప్లాటినమ్ డిస్క్ వేడుకను చేయనున్నాం అన్నారు. హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్ కీలకమైన పాత్రలో నటించారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృధ్వీ, కాశీ విశ్వనాధ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, సహ నిర్మాత: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: జయ.బి.