తమన్నా పెళ్లిచూపులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా పెళ్లిచేసుకుని సినిమాలకు దూరం అవుతుందా అని టెన్షన్ పడకండి..! అసలు విషయం ఏంటంటే.. గత ఏడాది తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద సంచలన విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ చిత్రాన్ని హిందీ, తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ హక్కులు తీసుకున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ మొదలైన ఈ సినిమా ఏప్రిల్ నుండి సెట్స్‌పైకి రానుంది. విజయ్ దేవరకొండ, రీతూవర్మ నటించిన ఈ సినిమాలోని రీతూవర్మ పాత్రలో తమన్నా నటిస్తుందట. ఇప్పటికే తమన్నాను హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ చేశాడు దర్శకుడు. అదీ విషయం! ఇక హీరోగా కొత్త అబ్బాయి నటిస్తాడని అంటున్నారు. తమిళ్‌లో ఈ చిత్రానికి ‘పోన్ ఒండ్రు కండెన్’ అనే టైటిల్ ఓకె చేశారు. సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో హీరోగా విష్ణువిశాల్ నటిస్తున్నాడు. ఈ సినిమాలోని పాత్ర చేయడంపై తమన్నా చాలా హ్యాపీగా ఉందట. చాలా థ్రిల్‌గా కూడా ఉందని చెబుతోంది. ముఖ్యంగా నేను గౌతమ్ మీనన్ ఫ్యాన్‌ని. ఆయన సినిమాల్లో హీరోయిన్స్‌ను బాగా చూపిస్తాడు అంటూ, ఈ సినిమాలో నన్ను ఎలా చూపిస్తాడో అన్న ఆసక్తిగా ఉంది అని చెప్పింది.