గ్లోబల్ స్టార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్.. అప్పటివరకు ఒక్క తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో. టాలీవుడ్‌లో కమర్షియల్ విజయాలు అందుకుంటున్న ప్రభాస్‌కు వేరే ఏ భాషలో పెద్దగా మార్కెట్ లేదు. అంతవరకు ఓ తెలుగు హీరో అంట అనేవరకే అతని ఇమేజ్ ఉండేది. అప్పుడప్పుడు ఆయన సినిమాలు హిందీలో డబ్ చేయబడి.. ఏ స్టార్ టీవీలోనో, మరో టీవీలోనో వచ్చేవి.. ఓ కౌన్ హై.. అంటే, ఓతో టాలీవుడ్‌కా హీరో అని నార్త్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు సాధారణంగా. కానీ అతని జీవితంలో పెద్ద మార్పు జరగడం.. ఇన్నాళ్ళూ ఓ టాలీవుడ్ కా హీరో అని అన్నవాళ్లే.. మేరా బాహుబలి హీరో.. అంటూ ప్రేమించడం మొదలుపెట్టారు? అదే ప్రభాస్ జీవితంలో జరిగిన మిరకిల్.. బాహుబలి? ఇండియన్ స్క్రీన్‌పై మునుపెన్నడూ రానటువంటి అద్భుతం.. బాహుబలి.. ఒకప్పుడు ఏ అవార్డు ఫంక్షన్‌లో కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడని వారంతా, ఇపుడు కేవలం బాహుబలి గురించే మాట్లాడుకుంటున్నారు. అదంతా ఒక దర్శకుడి కల. దాన్ని సాకారం చేయడానికి రిస్క్ చేశాడు ప్రభాస్.. అంతే ఆ సినిమాతో ఆయన స్టార్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ప్రభాస్ అంటే ఒక్క తెలుగు హీరో కాడు.. ఇండియన్ హీరో.. ఆయన సినిమాలు ఇప్పుడు ఏ భాషలో అయినా డబ్ అయ్యాయంటే చాలు అక్కడ క్రేజ్ మార్కెట్ ఏర్పడి ఆయన సత్తా కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు ప్రభాస్ ప్రపంచంలోనే పాపులర్ హీరోలుగా చెలామణి అవుతున్న వాళ్ల సరసన చేరాడు. ప్రపంచంలో ఇప్పుడున్న హీరోల్లో టాప్ 15గా లెక్కేస్తే అందులో ప్రభాస్ కూడా ఉంటాడు.. అదీ లెక్క! ఈ విషయంపై ఓ సర్వే జరిగింది. ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కాదు. హి ఈజ్ గ్లోబల్ స్టార్! ప్రభాస్ జీవితంలో బాహుబలి మరొకటి రాదు, కానీ వచ్చిన అవకాశాన్ని వాడుకుని బాహుబలిగా సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు ప్రభాస్.
అట్లీ దర్శకత్వంలో...
ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలని ప్రేక్షకులు, సినీ జనాలు ఆరాటపడుతున్న తరుణంలో రెబల్‌స్టార్ తర్వాతి ప్రాజెక్టులపై ఆసక్తికర కథనాలు వినబడుతున్నాయి. ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న ప్రభాస్, అది పూర్తవగానే తమిళ యువ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో ‘రాజా రాణి’, ‘తేరి’ వంటి సినిమాల్ని రూపొందించిన అట్లీ ప్రస్తుతం ఇలయదళపతి హీరోగా ఒక సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అది పూర్తవ్వగానే అట్లీ, ప్రభాస్‌కు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తాడని అంటున్నారు.