త్వరలోనే ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఫస్ట్‌లుక్ ఉగాది సందర్భంగా విడుదలవుతుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అసహనాన్ని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మహేష్, ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌కి కామెంట్ పెట్టాడు. డియర్ ఫ్యాన్స్, మహేష్ 23వ సినిమా ఫస్ట్‌లుక్ కోసం మీరెంతగా ఎదురుచూస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ, మా టీమ్ సినిమా కోసం రాత్రీ పగలు కష్టపడి షూటింగ్ చేస్తున్నాం.
త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం, కాస్త ఓపిక పట్టండి అని సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఇలా మహేషే డైరెక్టుగా స్పందించడంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. ఈ సినిమా ప్రారంభమై దాదాపు పది నెలలు కావస్తున్నా కూడా ఇప్పటివరకూ సినిమాకు సంబంధించిన టైటిల్ కానీ, ఫస్ట్‌లుక్ కానీ బైటికి రాలేదు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టైటిల్‌పై పలు రకాల పేర్లు వినిపించాయి. ఏజెంట్ శివ, అభిమన్యు, మిస్టర్ ఎక్స్ లాంటి టైటిల్స్ ప్రచారం పొందినా కూడా ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారనే విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా స్పై అనే టైటిల్ పెడతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారిగా మహేష్ నటిస్తున్న ఈ చిత్రంలో అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేయనున్నారు.