భయంతో షీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శే్వతామీనన్, మహత్‌రాఘవేంద్ర, చైతన్య, ఉత్తేజ్ ప్రధాన తారాగణంగా మహేశ్వర ఆర్ట్ పతాకంపై పర్సరమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘షీ’ (ఈజ్ వెయిటింగ్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రేమకథతో మన సంస్కృతి, సంప్రదాయాలకు భయాన్ని జోడించి వైవిధ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఫిబ్రవరిలో షెడ్యూల్ పూర్తవుతుందని, మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. పంచభూతాలపై వచ్చే పాట అందరికీ నచ్చుతుందని, మహత్, చేతనకు బ్రేక్ ఇచ్చే చిత్రం ఇదవుతుందని ఆయన అన్నారు. రమాప్రభ, కవిత, పోసాని, సూర్య, ధన్‌రాజ్, చిత్రంశ్రీను తదితరులు నటించిన ఈ సినిమాకి పాటలు: కాసర్ల శ్యామ్, రామ్‌పైడిశెట్టి, సాయిసిరి, సంగీతం: భోలె, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కెమెరా: అనిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పర్స రమేష్‌మహేంద్ర.