ఎన్టీఆర్- వెంకటేష్‌ల మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఈ మధ్య తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తరహా చిత్రాల్ని రూపొందించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడట. ఇటీవలే ‘గురు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకటేష్, మల్టీస్టారర్ చిత్రాలకు కొత్త ఊపిరి పోశాడు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గోపాల గోపాల వంటి చిత్రాలతో ఈ తరహా చిత్రాలకు తెరలేపారు. వెంకటేష్-ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రూపొందే చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరో కాదు క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్. గత కొంతకాలంగా త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఓ కథ చెప్పాడని, ఆ కథ నచ్చడంతో ఎన్టీఆర్ ఈ మల్టీస్టారర్ చేయడానికి ఆసక్తి చూపించాడని టాక్. మరి ఈ సంచలన కాంబినేషన్‌లో రూపొందే చిత్రమంటే ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సినిమాకు సంబంధించి అధికారిక వివరాలు వెలువడాల్సి వుంది.