దీపావళికి రోబో 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రోబో 2.0’. ఇండియాలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిదే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి కొన్ని రకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్ ఏకంగా ఐదు పాత్రల్లో కనిపిస్తాడని,అందులో రోబో చిట్టి, సైంటిస్ట్ వశీకర్, విలన్ రోబోతోపాటు మరో రెండు పాత్రలు కూడా వుంటాయని ఈ వార్తల సారాంశం. దాంతోపాటు ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కూడా ఏకంగా 12 పాత్రల్లో కనిపిస్తాడంటూ ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలియడంతో ప్రేక్షకులు అయోమయానికి గురవుతారని అనుకున్న శంకర్ స్పందించాడు. ఈ చిత్రంలో ప్రస్తుతం వస్తున్న రూమర్స్‌కు తగ్గట్టుగా ఇందులో రజనీకాంత్ ఐదు పాత్రల్లో నటించడంలేదని, అలాగే అక్షయ్‌కుమార్ కూడా 12 పాత్రలు చేయడంలేదని, ఈ సినిమాపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని శంకర్ తెలిపాడు. సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా మేము తెలియజేస్తామని, ప్రేక్షకు లు సహనం వహించాలని కోరాడు. మొత్తానికి రోబో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు ప్రచారం సాగుతున్నాయని అంటున్నారు.