చిన్ని చిన్ని ఆశలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్, గట్టు మను, సోనియా ప్రధాన తారాగణంగా టి.ఆర్. మూవీ మేకర్ పతాకంపై సంతోష్ నేలంటి దర్శకత్వంలో గట్టు వెంకన్న, పవన్ సోని సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత గట్టు వెంకన్న మాట్లాడుతూ- కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని అందమైన ప్రేమకథతో ఎక్కడా వల్గారిటీ లేకుండా తెరకెక్కించామని, సినిమాలోని ట్విస్టులు హైలైట్‌గా వుంటాయని, సెన్సార్ వారు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యు సర్ట్ఫికెట్ అందించారని తెలిపారు. ఆశలేని జీవితం వృథా అన్న కానె్సప్టుతో హీరో జీవితం అతని కోరికతో ఎటువంటి మలుపు తీసుకుందనే కథనంతో క్యూట్ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించామని కథానాయకుడు పవన్ తెలిపారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాలో ఓ కుర్రాడు ప్రియురాలి కోసం ప్రయత్నించి చివరికి ఓ సిమ్ కార్డుతో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అన్న కథనంతో ఈ సినిమా సరికొత్త కోణంలో ఆవిష్కరించామని దర్శకుడు సంతోష్ తెలిపారు.