ప్రభాస్‌తో లవ్‌స్టోరీ తీస్తా -కృష్ణంరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెబల్‌స్టార్‌గా తెలుగు తెరపై తిరుగులేని ఇమేజ్‌ని స్వంతం చేసుకుని యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు నటుడు కృష్ణంరాజు. యాక్షన్ ఇమేజ్‌లో సినిమాలు చేస్తూనే మరోవైపు విభిన్న కథా చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం అడపాదడపా నటిస్తున్న కృష్ణంరాజు నటుడిగా 50 వసంతాలు పూర్తిచేసుకోబోతున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖి.
నటుడిగా ఇది ఎన్నో పుట్టినరోజు?
- ఆడవాళ్ళనే కాదు సినిమా హీరోలను కూడా వయసు అడగకూడదు. ఇక నటుడిగా ఇది నా 50వ పుట్టిన రోజు.
ఇనే్నళ్ల కెరీర్‌ను చూసుకుంటే ఏమనిపిస్తోంది?
- చాలా ఆనందంగా వుంది. పరిశ్రమ అంటేనే కుటుంబం లాంటిది. అందరితో, అన్ని రకాల విభాగాలవారితో కలిసి పనిచేయడం మరువలేని విషయం.
ఇంకా చేయాలనుకున్న పాత్రలున్నాయా?
- నటుడికి తృప్తి అనేది వుండదు. మనం చేసినదాంట్లో సంతృప్తిపడాలి తప్ప నటుడిగా అన్ని రకాల విభిన్నమైన పాత్రలు చేశాను. ఏదైనా శాటిస్‌ఫాక్షన్ వుండాలి.
మీరు దర్శకత్వం చేస్తారని అన్నారు? ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?
- తప్పకుండా నా దర్శకత్వంలో సినిమా వుంటుంది. ఓ మంచి పాయింట్‌తో సినిమా చేయాలని కథ కూడా రెడీ చేశాను. ప్రస్తుతమున్న విద్యావ్యవస్థ కరెక్టు కాదు. గదుల్లో కూర్చోబెట్టి చదువు చెప్పేకంటే ప్రకృతిలోకి తీసుకెళ్లి ప్రాక్టికాలిటీని వారికి నేర్పించడం అవసరం. పుస్తకాల్లో వున్నదానికి నిజ జీవితంలో జరిగే దానికి సంబంధం లేదు. ఈ అంశంతో ఈ సినిమా వుంటుంది.
టైటిల్ ‘ఒక్క అడుగు’ అని పెట్టారు, అదేనా?
- ఔను. ఒక్క అడుగు టైటిల్ దానికి ‘ముందుకు వేయండి’ అనే కాప్షన్‌తో వుంటుంది.
మరి ప్రభాస్‌తో సినిమా అన్నారు?
- ఔను. ప్రభాస్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘బాహుబలి-2’ తరువాత వుంటుంది. మంచి ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
‘బాహుబలి’ లాంటి సినిమా తరువాత ప్రభాస్‌తో లవ్‌స్టోరీ చేయడం కరెక్టు అంటారా?
- నటుడన్నపుడు అన్ని రకాల సినిమాలు చేయాలి. అప్పట్లో నేను రెబల్‌స్టార్ ఇమేజ్‌తో వున్నపుడు అన్ని యాక్షన్ సినిమాలే వచ్చాయి. కాని మధ్యమధ్యలో ‘అమరదీపం’, ‘మనవూరి పాండవులు’ లాంటి సినిమాలు చేసి జనాన్ని మెప్పించా. ప్రభాస్‌తో చేసే సినిమా కూడా యాక్షన్ కలగలిపిన లవ్‌స్టోరీగా వుంటుంది.
‘బాహుబలి’తో ప్రభాస్ స్థాయి పెరిగింది, దీని గురించి?
- చాలా ఆనందంగా వుంది. రాజవౌళి అలా మావాడి ఇమేజ్‌ని పెంచేశాడు. ఇపుడు ఎక్కడికెళ్లినా నన్ను ‘బాహుబలి’ పెదనాన్న అని అంటున్నారు.
మరి, ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లిచేస్తారా?
- ఈ ఏడాది తప్పకుండా జరుగుతుంది. ‘బాహుబలి-2’ సినిమా తరువాత పెళ్లిచేస్తాం. సంక్రాంతి పండుగకు మాట కూడా తీసుకున్నాను. ప్రస్తుతం అమ్మాయిని వెదికే పనిలో వున్నాం.
ఈ మధ్య ఎక్కువగా నటించడంలేదు, కారణం?
- ఈ మధ్య ‘రుద్రమదేవి’లో మంచి పాత్ర చేశాను. మంచి పాత్రలు వస్తే నటించడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన పాత్ర?
- చాలా సినిమాల్లో చాలా పాత్రలు ఇష్టం. కానీ ‘మనవూరి పాండవులు’ చిత్రంలోని పాత్ర బాగా ఇష్టం. దాంతోపాటు ‘కటకటాల రుద్రయ్య’ వంటి చాలా పాత్రలు ఇష్టం.
రాజకీయాల్లో క్రియాశీలకంగా వున్నారా?
- ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్నాను. ఎన్నికల కోసం 13 జిల్లాలు తిరిగాను. బిజెపి పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి ఎలా వుంది?
- సినిమా రంగంలో ఎగుడు దిగుడులనేవి సహజమే. ప్రస్తుతం కొత్త కొత్త సినిమాలతో సరికొత్త టెక్నాలజీతో సినిమాలు చేస్తున్నారు. ఈమధ్యకాలంలో చాలా విభిన్నమైన సినిమాలు వచ్చాయి. నానీ నటించిన ‘్భలే భలే మగాడివోయ్’ సినిమా బాగా నచ్చింది. నిజంగా అలాంటి పాత్ర ఒప్పుకోవడం అతని గొప్పతనం. నేనైతే ఆ పాత్ర చేయను.
50 ఏళ్ళ సంబరాన్ని ఎక్కడ జరుపుతున్నారు?
- జూన్‌తో నా సినీ కెరీర్ 50 వసంతాలు అవుతుంది. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి భారీ వేడుకలను నిర్వహిస్తాం. అలాగే, 25 నుంచి 40 ఏళ్ల వరకూ నా అభిమానులు వున్నవారిని సత్కరించాలని వుంది.

-శ్రీ