అప్పుడే పెళ్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా సౌత్‌లో క్రేజ్ తెచ్చుకున్న నయనతార విషయం ఎప్పుడూ సంచలనమే. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈమె తాజాగా కమెడియన్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఓకే చెప్పి షాక్ ఇచ్చింది. ఇక గత కొంతకాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న నయనతార అతనితో కలిసి డేటింగ్ కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని, కొన్ని సినిమా ఫంక్షన్లకు కూడా హాజరవుతుండడంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్లు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాదే వీరిద్దరూ ఆర్యసమాజ్‌లో పెళ్లిచేసుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రేమకథల్ని నడిపిన నయనతార తాజాగా మూడో ప్రేమాయణం మొదలుపెట్టింది. ఆ మధ్య వీరిద్దరూ విడిపోయారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి విషయంపై విఘ్నేష్ శివన్ తొందరపెడుతున్నాడని, కానీ నయనతార మాత్రం ఇంకా కొన్ని సినిమాలు చేసేదాకా ఆగమని చెబుతోందట. అప్పుడే పెళ్లికి తొందరెందుకని విఘ్నేష్‌కు క్లాసులు కూడా పీకుతోందని టాక్.