సక్సెస్‌ఫుల్ రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ తన రెండో సినిమా కూడా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. శర్వానంద్, యువి క్రియేషన్స్ వాళ్లలో సంతోషం చూడాలన్న కోరిక నెరవేరిందన్నారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ దర్శకుడు గాంధీ ప్రతి పాత్రను అద్భుతంగా మలిచారని, ఈ సినిమాలో తన డ్యాన్స్‌లకు మంచి అభినందనలు వస్తున్నాయని అన్నారు. ఈ క్రెడిట్ రఘు మాస్టర్‌కే చెందుతుందని, ఇంత మంచి సినిమాని ఇచ్చిన వంశీ, ప్రమోద్‌లకు థ్యాంక్స్ అన్నారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ పాటలు ఇంత పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా వుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, నాగినీడు, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.