‘శేఖరంగారి అబ్బాయ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచీవర్స్ సిగ్నేచర్ ఎమ్.ఎఫ్ క్రియేషన్స్ బ్యానర్‌పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖరరావు, మధుఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం ‘శేఖరంగారి అబ్బాయ్’. విన్ను మద్దిపాటి, అక్షత నాయకా నాయికలు. సాయి ఎలేందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. సీనియర్ దర్శకులు సముద్ర ఆడియో సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో విన్ను మాట్లాడుతూ.. శేఖరంగారి అబ్బాయ్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హీరోయిన్ అక్షత దర్శకురాలిగా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేసింది. కంటెంట్ మరియు టెక్నికల్‌గా శేఖరంగారి అబ్బాయ్ వెల్‌మేడ్ ఫిలిం.. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిదన్నారు. హీరోయిన్ దర్శకురాలు అక్షత మాట్లాడుతూ.. యూనిట్‌కు శేఖరంగారి అబ్బాయ్ ది బెస్ట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నానన్నారు. నిర్మాత మద్దిపాటి సోమశేఖర్‌రావు మాట్లాడుతూ.. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. విజయంపై ధీమాతో ఉన్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత మధుఫోమ్రా, నటులు కాశీవిశ్వనాథ్, సంగీత దర్శకుడు సాయి ఎలేందర్, డి.ఎస్.రావు, సూర్య, అనురూప్, సోని చరిష్ట, ఆదిత్య నిరంజన్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.