14న శివలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రాఘవేంద్ర లారెన్స్, రితికసింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం ‘శివలింగ’. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో.. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ‘శివలింగ’ చిత్రం 14న విడుదలకు సిద్ధమైంది. వాసు దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన ఈ చిత్రం అక్కడ పెద్ద సక్సెస్ కావడంతో తెలుగు, తమిళంలో లారెన్స్, రితిక సింగ్‌లపై చిత్రీకరించారు. సినిమాను క్వాలిటీగా నిర్మించాం. లారెన్స్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన కాంచన, గంగ చిత్రాల సక్సెస్‌లే అందుకు ఉదాహరణలు. అలాగే రీసెంట్‌గా గురు చిత్రంతో సక్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ యాక్షన్‌సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది అన్నారు. రమేష్ పిళ్ళై మాట్లాడుతూ.. ‘కన్నడలో శివలింగ పేరుతో శివరాజ్‌కుమార్ నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో లారెన్స్, రితిక సింగ్‌లతో రీమేక్ చేశాం. వాసు దర్శకత్వంలోనే సినిమా రూపొందింది. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. లారెన్స్‌కి కాంచన కంటే మంచి పేరు తెచ్చే చిత్రమవుంది అన్నారు.