మల్టీ స్టారర్‌గా చిరు సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి తన 151వ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో బిజీగా ఉన్నారు. అయితే 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా వినిపిస్తున్న వార్తలు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఖైదీ నంబర్ 150 చిత్రంతో వంద కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిన ఆయన ఈసారి కూడా అదే తరహాలో భారీ కలక్షన్లు రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజా చిత్రంలో చిరంజీవితోపాటుగా మరో ఇద్దరు హీరోలు కూడా నటించనున్నారట. ఆ ఇద్దరిలో ఒకరు శ్రీకాంత్ ఫైనలైజ్ అయినట్లుగా తెలుస్తోంది. మరో హీరో వెంకటేష్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారట. గతంలోనే వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్‌లో ఓ చిత్రం రావలసి ఉండగా అది సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈసారైనా వీరిద్దరు కలిసి నటించడానికి సిద్ధవౌతున్నారు. అలా చిరంజీవి తాజా చిత్రం మల్టీస్టారర్ చిత్రంగా రూపొందనున్నదని టాలీవుడ్ టాక్!