ఆకట్టుకునే బొమ్మల రామారం పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషాంత్ దర్శకత్వంలో అందరూ నూతన నటీనటులతో పుధారి అరుణ రూపొందించిన చిత్రం ‘బొమ్మల రామారం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని గాయని సుశీల విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాలో పాటలన్నీ బాగా వున్నాయని, ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆమె కోరుకున్నారు. సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని, ఈ సినిమా చూసినవారు నచ్చితే మరో పదిమందికి చెప్పాలని దర్శకుడు నిషాంత్ తెలిపారు. యూనిట్ అంతా కష్టపడి పనిచేసిన బొమ్మల రామారం చిత్రం అందరికీ నచ్చుతుందని నిర్మాత అరుణ అన్నారు. సూరి, మోహన్ భగత్, రూపారెడ్డి, సంకీర్తన, తిరువీర్, ప్రియదర్శిని, విమల్, జ్యోతివర్మ, జగన్, గుణకర్, అభయ్, శివ, కేశవ్, హారిక, స్వాతి, సంధ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:బి.వి.అమర్‌నాధ్ రెడ్డి, సంగీతం:కార్తీక్ కొడగండ్ల, ఎడిటింగ్:శివ శ్రీనివాస్, నిర్మాత:పుధారి అరుణ, రచన, దర్శకత్వం: నిషాంత్ పుధారి.