మరకతమణి మోషన్ పోస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, నిక్కీగర్లాని జంటగా రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ పతాకాలపై ఎ.ఆర్.కె. శరవణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మరకతమణి’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘మలుపు’ చిత్రం తర్వాత అదే జంటతో ఆద్యంతం ఆసక్తికరంగా వుండే అడ్వెంచర్ ఘోష్ట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి దిబుథామస్ సంగీతం అందిస్తున్నారని, కబాలి సింగర్ అనిల్‌కామరాజు నటించి ఓ పాట పాడారని తెలిపారు. కోట శ్రీనివాసరావు పాత్ర హైలైట్‌గా సాగే ఈ చిత్రంలో బ్రహ్మానందం కామెడీ వైవిధ్యంగా ఉంటుందని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఆనంద్‌రాజ్, కామరాజ్, రాందాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.వి.శంకర్, ఎడిటింగ్: ప్రసన్న జి.కె, నిర్మాణం: రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.కె.శరవణన్.