అల్లు అర్జున్ సరసన రష్మిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా పూర్తయ్యాక వెంటనే రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఒక సినిమాని మొదలుపెడతారట. ఈ సినిమాకి ‘నా పేరు సూర్య’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారట. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ హీరోయిన్‌ను తీసుకోనున్నారట. ఆ నటి మరెవరో కాదు 2016 డిసెంబర్‌లో విడుదలైన కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’లో హీరోయిన్‌గా చేసిన రష్మిక. ఈ చిత్రం ఆమెకు మొదటిదే అయినా అందులో ఆమె నటనకుగాను మంచి ప్రశంసలు దక్కాయి. అందుకే ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచన చేసిన వంశీ తాజాగా హైదరాబాద్‌లో ఆమెపై టెస్ట్‌షూట్ కూడా నిర్వహించారట. అందులో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి బన్నీ అండ్ కో బాగా ఇంప్రెస్ అయ్యారని, దాదాపు ఆమెనే ఖాయం చేసేశారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదలయ్యేవరకు కాస్త వేచి చూడాల్సిందే.