నేను పొగరుబోతునే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విషయాన్ని చెప్పింది స్వయంగా ఆ హీరోయినే!! మిగతా హీరోయిన్స్‌కు కాస్త భిన్నంగా ప్రవర్తించే గ్లామర్ భామ ఈ మధ్య సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదుంది. ఎవరైనా ఏదైనా అడిగితే మొహం మీదే ఠక్కున జవాబు చెప్పే ఈ అమ్మడికి పొగరని అందరూ అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈమె అవును నేను పొగరుబోతునే అంటూ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది. ఈపాటికి ఆమె ఎవరో మీకు అర్థం అయి ఉంటుంది కదా..! అవును మీరు అనుకున్న హీరోయిన్... నయనతార!! ప్రస్తుతం తన మూడో ప్రేమాయణాన్ని ఘాటుగా సాగిస్తున్న ఈ అమ్మడు సోలో హీరోయిన్‌గా సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో నయన ‘ఔను నేను పొగరుబోతునే’ అంటూ స్పందించడమే కాకుండా తనను తక్కువగా చూసేవాళ్ళ విషయంలో మాత్రమే తాను పొగరు చూపిస్తానని, మొదట్లో పరిశ్రమ గురించి తెలియకపోవడంవల్ల కథల ఎంపికలో, గ్లామర్ విషయంలో పొరపాట్లు చేసానని, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉన్నానని చెప్పింది. సినిమా పూర్తయిన తరువాత ప్రమోషన్‌కు రానని మొదట నిర్మాతలకు కండిషన్స్ పెడుతుండడంతో ఈ అమ్మడికి పొగరనే విషయంపై వార్తలు జోరుగా వస్తున్నాయి మరి!!