చిరు మీసం మెలేస్తే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిది సంవత్సరాలుగా చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. రీఎంట్రీ ఇస్తూ రూపొందించే 150వ సినిమా కోసం కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతూనే వున్నాయి. ఇప్పటికే పలు కథలు విన్న చిరంజీవి, మొత్తానికి తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై వినాయక్ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పందిస్తూ చిరంజీవితో చేసే సినిమా మార్చిలో ప్రారంభవౌతుందని ప్రకటించాడు. చిరంజీవి హీరోగా నటించే 150వ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్టుగా చిరంజీవి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ఆయన మీసం మెలేసిన ఫోటోలు అందరిలో ఆసక్తిని నింపాయి. చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపించడంతో ఇది ఆయన చేసే తదుపరి సినిమా కోసమనేనని అనుకుంటున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా సమయంలో ఇలా మీసంతో కనిపించారు. మళ్లీ ఇప్పుడు ఇలా మీసం మెలేసి కన్పించడం ఈ సినిమా కోసమేనని అనుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో క్రేజీగా మారింది.