డేటింగ్ కాదంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దిల్లున్నోడు’ చిత్రంలో తెలుగులో నటించిన జాస్మిన్‌భాషిన్ ప్రముఖ నటుడితో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె మండిపడింది. ఆడామగా కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన ఏదోఒక లింకు పెడతారా అని ఫైర్ అయింది. ప్రముఖ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో తాను డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఖండించింది. ఆడామగా స్నేహితులుగా ఉండకూడదా అని ఈ భామ ప్రశ్నించింది. సిద్ధార్థ్ లాంటి స్నేహితుడు ఉండాలని అందరూ కోరుకుంటారని ఆమె తెలిపింది. మేమిద్దరం ‘దిల్‌సే దిల్ తక్’లో నటించామని అతడు తనకి బెస్ట్ ఫ్రెండ్ అని జాస్మిన్ తెలిపింది. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. తాను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టిపెట్టానని ప్రేమలో పడేంత తీరిక లేదని తెలిపింది. తెలుగులో దిల్లున్నోడు చిత్రంలో నటించిన జాస్మిన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు టీవీ షోలలో బిజీగా ఉంది.