పాటల్లో షాలిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమోఘ్ దేశ్‌పతి, అర్చన, శ్రేయావ్యాస్ హీరోహీరోయిన్లుగా స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై షేరాజ్ దర్శకత్వంలో పి.వి.సత్యనారాయణ నిర్మించిన ‘షాలిని’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టైటిల్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఈ చిత్రంతో దర్శక, నిర్మాతలకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు ఎక్కువగా రావాలి. అప్పుడే సినీ కార్మికులకు ఎక్కువ ఉపాధి లభిస్తుంది. త్వరలోనే రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అన్నారు. ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు బావున్నాయి. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా తీశారు. ఈ మధ్య హర్రర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. దర్శకుడు షేరాజ్ మాట్లాడుతూ.. ప్రతి క్షణం ఉత్కంఠత కలిగించే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. రొమాంటిక్ లవ్ హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది అన్నారు. ఈ కార్యక్రమంలో సాయివెంకట్, నవనీత్‌చారి, శ్రేయావ్యాస్ తదితరులు పాల్గొన్నారు.