అందరికీ మనసైనోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్ నందన్, ప్రియాసింగ్ జంటగా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో హసీబుద్దీన్ రూపొందిస్తున్న చిత్రం ‘మనసైనోడు’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ 80 శాతం పూర్తి చేశారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత హసీబుద్దీన్ మాట్లాడుతూ- ఓ అందమైన కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నారని, సినారె రాసిన దేశభక్తి గీతం ‘జయ జయ జయహే భారతావని సద్గుణ సమూపేత’ గీతం భారతదేశం గొప్పతనాన్ని చాటేవిధంగా, ప్రతి భారతీయుడు తలెత్తుకొని పాడే విధంగా ఉందని తెలిపారు. మగవారి జీవితాలలో స్ర్తిలు లేకపోతే ఎంత నష్టమో చిలిపిగా ఓ పాటను భాస్కరభట్ల రాశారని, ఆరు పాటలు ఆరు వైవిధ్యమైన విశేషాలతో రాసినవేనని, దేశానికి, యువతకు సందేశం అందించేలా ఉంటాయని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, ప్రస్తుతం పోసాని కృష్ణమురళి, హీరో హీరోయిన్లపై షూటింగ్ జరుపుతున్నామని ఆయన అన్నారు. రఘుబాబు, గిరిబాబు, కేదార్ శంకర్, గుర్రాజు, వేణుగోపాల్, అనంత్, చైతన్య, శశాంక, ఫణి, పవన్, గణపతి, వాసు, రవిశంకర్, రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: సుభాష్ ఆనంద్, నిర్మాత: హసీబుద్దీన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యవరపు వెంకటేశ్వరరావు.