14న శివలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవేంద్ర లారెన్స్, రితికా సింగ్ జంటగా అభిషేక్ ఫిలింస్ పతాకంపై పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై రూపొందించిన ‘శివలింగ’ ఈ నెల 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ వేడుకలలో నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ- కన్నడంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం గురించి, వాసు దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదని, తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ‘గురు’ చిత్రం తరువాత రితికా సింగ్ తెలుగులో చేసిన ఈ చిత్రం, అలాగే లారెన్స్ మాస్టర్ కాంచన, గంగ చిత్రాల తరువాత విడుదలవుతున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని తెలిపారు. కన్నడంలో శివలింగ చేసిన తాను మంచి పేరు తెచ్చుకున్నానని, ఈ చిత్రంలో తన పాత్రను లారెన్స్ మరింత పెంచి చేయించారని నటుడు శక్తివాసు తెలిపారు. గురు సినిమా తనకొక స్పెషల్ చిత్రమని, ఆ సినిమా తరువాత ఈ సినిమా విడుదలవడం ఆనందంగా ఉందని, శివలింగతో మరింత పేరు వస్తుందని తాను భావిస్తున్నట్లుగా నటి రితికాసింగ్ తెలిపారు. అమ్మ, రాఘవేంద్రస్వామి, పరిశ్రమలో వున్న రజనీకాంత్ తనకు డాన్సర్‌గా అవకాశమిచ్చిన చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తులకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని, తెలుగులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని నటుడు రాఘవ లారెన్స్ తెలిపారు. కెమెరామెన్ సర్వేష్ మురారి తనను అందంగా చూపించాడని ఆయన అన్నారు. జనవరిలో రావాల్సిన ఈ సినిమా కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిందని, లేట్ అయినా లేటెస్టుగా వస్తున్నామని దర్శకుడు పి.వాసు తెలిపారు. రితికాసింగ్ పాత్ర వైవిధ్యంగా వుంటుందని, లారెన్స్‌లోని డాన్సర్, నటుడు, డైరెక్టర్ ఈ చిత్రంలో వైవిధ్యంగా కన్పిస్తారని, తప్పక అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందని ఆయన వివరించారు.