మేలో రారండోయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రారండోయ్.. వేడుక చూద్దాం’. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. మనం, సోగ్గాడే చిన్నినాయన చిత్రాల తరువాత అన్నపూర్ణ సంస్థ నుండి వస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, సంపత్, కౌసల్య, ఇర్షాద్, చలపతిరావు, అన్నపూర్ణ, పృధ్వీ, సప్తగిరి, వెనె్నల కిశోర్, పోశాని, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితాచౌదరి, రజిత, ప్రియ, తా.రమేష్, మధు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఎస్.వి.విశే్వశ్వర్, పాటలు: శ్రీమణి, రామజోగయ్యశాస్ర్తీ, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణకృష్ణ కురసాల.