బాక్సింగ్ కన్నా యాక్టింగ్ కష్టం -రితికాసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గురు’ చిత్రంలో వెంకటేష్‌తో నటించి నటిగా మార్కులు కొట్టేసింది రితికాసింగ్. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు పొందింది. గురు మాతృక సాలాఖద్దూస్ హిందీ చిత్రంలో కూడా మాధవన్‌తో నటించి బాలీవుడ్ అవకాశాలూ పొందుతోంది. నటిగా మారతానని ఎప్పుడూ ఊహించలేదని, ఒక్కసారిగా ఇంత ఫేమ్ రావడం ఆనందాన్నిస్తోందని రితికాసింగ్ చెబుతోంది. తాజాగా ఆమె నటించిన ‘శివలింగ’ నేడు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పలు విశేషాలు ఆమె మాటల్లోనే..
యాక్టింగ్ కష్టం
చిన్నప్పటి నుండీ బాక్సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇష్టపడి నేర్చుకున్నా. ఇప్పుడు యాక్టింగే ఓ ప్రధానమైన వ్యాపకంగా మారింది కనుక దీన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే బాక్సింగ్‌తో పోలిస్తే యాక్టింగ్ చేయడం చాలా కష్టం. మార్షల్ ఆర్ట్స్ చేయడం ఈజీ. కొత్త అవ్వడంవల్ల ప్రతిదీ కష్టమనిపించింది. శివలింగ చిత్రం చేసేటప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్, డాన్సుల కోసం ఎక్కువగా శ్రమించా. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 దాకా ప్రాక్టీస్ ఉండేది.
ఛాలెంజింగ్‌గా...
చిన్నప్పుడు బాక్సింగ్ నేర్చుకోవడంతో ఏషియన్ బాక్సింగ్ ట్రోఫీలో విన్నర్‌గా నిలిచాను. అప్పుడే నన్ను చూసిన మాధవన్ నాన్నతో సంప్రదించి తమిళ చిత్రం ‘ఇరుదుసుట్రు’లో అవకాశం ఇచ్చారు. నటిని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రతిదీ అనుకోకుండా జరిగింది. శివలింగ చిత్రం కథ నచ్చి చేశాను. ఈ పాత్ర నన్ను ఆకట్టుకుంది. అందుకే ఒప్పుకున్నా. ఇదో హారర్ ఎంటర్‌టైనర్. కన్నడ వెర్షన్‌లో శివలింగ చూశాను. ఆ సినిమా ప్రభావం నాపై పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఫ్రెష్‌గా వుండేలా ఛాలెంజింగ్‌గా నటించే ప్రయత్నం చేశా. గురులో మేకప్ లేకుండా నటించా. ఇక్కడ ఓ మామూలు అమ్మాయిలా నటించాలి. మేకప్ వేసుకున్నా డాన్సులు చేయడం, డిఫరెంట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ చూపించడం కష్టమనిపించింది. గతంలో ఎప్పుడూ డాన్సులు చేయలేదు. అయితే, లారెన్స్ మాస్టర్ మంచి డాన్సర్. నాకేమో డాన్సులు చూస్తే భయం. అందులో చీరలో డాన్సులు చేయాలి. ఇంకా పెద్ద సవాలు ఇది. మొత్తానికి మాస్టర్ సలహాలతోనే డాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ చేశాను. అవన్నీ సినిమాకు హైలెట్‌గా వుంటాయి.
ఇద్దరూ మంచి నటులే..
‘గురు’ చిత్రంలో వెంకటేష్‌తో, ‘సాలాఖద్దూస్’లో మాధవన్‌తో కలిసి నటించాను. వారిద్దరూ అమేజింగ్ యాక్టర్స్. షూటింగ్‌లో అన్ని విధాలుగా సహకరించారు. ‘గురు’ చిత్రంలో నటించడానికి వెంకటేష్ ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నా. మంచి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధమే.
నటనకు ఆస్కారం
నా కెరీర్‌లో వైవిధ్యం వున్న సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నా. నటనకు ఆస్కారం వుండే కథలను ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నాను.
అభిమాన తారలు
ప్రియాంకా చోప్రా, అలియాభట్, అనుష్కాశర్మ నా అభిమాన తారలు. వీళ్లనే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని నటించే ప్రయత్నం చేస్తాను. చిన్న వయసు నుండి వీరి చిత్రాలు చూస్తూనే ఉన్నాను. వీరు సాధించిన విజయాలు చూసి ఆనందపడుతుంటాను.

-శ్రీ