కొబ్బరిమట్ట టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా రూపక్ డోనాల్డ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరిదశలో వుంది. సినిమాకు సంబంధించిన శంభో శివశంభో పాట టీజర్‌ను గురువారం ఉదయం దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సంపూతో పనిచేయటానికి ప్రయత్నించాను కానీ కుదరలేదని, భవిష్యత్తులో తప్పక అతనితో చేస్తానని, కొబ్బరిమట్ట టైటిల్ వైవిధ్యంగా ఆకట్టుకునేలా ఉందన్నారు. హైదరాబాద్ శివారు గ్రామాలలో, కోనసీమ ప్రాంతాలలో భారీ బడ్జెట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసే కార్యక్రమంలో ఉన్నామని, గతంలో విడుదల చేసిన లాంగెస్ట్ టీజర్ రికార్డ్‌గా మిగిలిపోయిందని, ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తున్నామని సంపూర్ణేష్‌బాబు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుందని, హృదయకాలేయం సినిమాకన్నా మూడింతలు నవ్వించేలా రూపొందుతోందని నిర్మాతలు ఆది కుంభగిరి, సాయిరాజేష్ నీలం తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:ముజీర్ మాలిక్, కథ, మాటలు:స్టీవెన్ శంకర్, దర్శకత్వం:రూపక్ డోనాల్డ్.