సంపూర్ణవిజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించిన మలావత్ పూర్ణ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 3పూర్ణ. డి.ఎస్. ఆర్.వి మీడియా పతాకంపై పి.వి.ఆర్. పిక్చర్స్ సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ తెలుగు భాషల్లో ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్ ఐపిఎస్, ఆనంద్, అతిథి, నిర్మాత దేవదాసు మోదుగు, పి.వి.ఆర్ ప్రతినిధి ఉదయ్ మొదలగువారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దేవదాస్ మోదుగు మాట్లాడుతూ- తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. ఆమె జీవిత కథ ఆధారంగా పూర్ణ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిందీలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ హక్కులు తీసుకున్నాను. నాకు అవకాశం కల్పించిన పి.వి.ఆర్ పిక్చర్స్ వారికి, అలాగే ప్రవీణ్‌కుమార్ ఐపిఎస్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా చిత్ర విడుదలకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ- పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా తెలంగాణ అమ్మాయి ఈ గిన్నిస్ రికార్డును సాధించినందుకు ఆమెను అభినందిస్తూ, ఆమె జీవిత కథను ఎంతమందికో స్ఫూర్తినిచ్చేలా ఈ చిత్రాన్ని తీసిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమన్నారు.
ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ మాట్లాడుతూ- ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రవీణ్‌కుమార్ సహకారంతో ఈ అవకాశం దక్కింది. నా జీవిత చరిత్రను సినిమాగా తీయడం మర్చిపోలేని అనుభూతి. ఈ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని నాతోటివాళ్లంతా దేశ ప్రగతికి తోడ్పడాలని కోరుకుంటున్నానన్నారు.