నాకు ఇంకో పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ హీరోగా ఆనంది హీరోయిన్‌గా శ్యామ్ ఆంటోనీ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రాన్ని తెలుగులో ‘నాకు ఇంకో పేరు వుంది’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. తమిళంలో ‘ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు’ అనే టైటిల్‌తో రూపొందుతోంది. త్వరలో విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా చిత్ర వివరాలను గురించి నిర్మాతలు తెలియజేస్తూ సంగీత దర్శకుడిగా మంచి పేరున్న జి.వి.ప్రకాష్ ‘త్రిష లేదా నయనతార’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడని, ఆయన నటిస్తున్న మూడో చిత్రమిదని అన్నారు. ఇటీవలే తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘ప్రేమకథాచిత్రమ్’ తమిళ రీమేక్‌లో జి.వి.ప్రకాష్ నటించాడని, శ్యామ్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని, యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: రూబెన్, ఆర్ట్: ఉమేష్ జె.కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ప్రేమ్, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, దర్శకత్వం: శ్యామ్ ఆంటోనీ.