నటుడిని కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను మంచి నటుడిని కాదు. ఎందుకంటే గొప్ప దర్శకుడు ఆ విషయాన్ని ఎక్కడా ఒప్పుకోరు, ఒప్పుకోలేదు కూడా’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ బాంబు పేల్చారు. ‘నాకు భారతీరాజా అంటే ఇష్టం. ఆయనా నన్ను ప్రేమిస్తారు. కానీ, పాత పత్రికలు, ఇంటర్వ్యూలు ఒక్కసారి తిరగేసి చూడండి. ఆయన ననె్నప్పుడూ నటుడిగా ఒప్పుకోలేదు. ఏదైనా సందర్భంలో జర్నలిస్ట్ మిత్రులు రజనీపై మీ అభిప్రాయం చెప్పండని అడిగినిపుడు -రంజనీ మంచి వ్యక్తి అని మాత్రమే చెప్పుకొచ్చారు’ అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ‘అసలు అతన్ని నటుడిగా జనం ఎలా గుర్తించారో అని భారతీరాజా ప్రశ్నిస్తున్నట్టు అనుక్షణం ఆయన మైండ్ వాయిస్ నాకు వినిపిస్తూనే ఉంటుంది’ అంటూ రజనీ మరో షాక్ ఇచ్చారు. చెన్నైలో ‘్భరతీరాజా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సినేమా’ ప్రారంభోత్సవ సందర్భంలో చమత్కార వ్యాఖ్యలతో భారతీరాజా పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు రజనీకాంత్. ‘నన్ను ఆయన రెండుసార్లే టైం అడిగారు. ఒకసారి 16 వాయదిన్‌లై చిత్రం కోసం, ఇంకోసారి ఈ కార్యక్రమానికి హాజరుకమ్మని. అందకే వచ్చా. ఇప్పటికీ నేను ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్‌నే. సినిమా జీవితాన్ని అందించిన కె బాలచందర్ నుంచి కొంత, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి కొంత నేర్చుకున్నా’ అంటూ రజనీకాంత్ తన గతాన్ని సింపుల్‌గా గుర్తు చేసుకున్నారు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ ‘16 వాయదిన్‌లై చిత్రం కోసం నేను ఆయన్ని కలిసినపుడు మామూలు మనిషి. ఈ కార్యక్రమానికి రమ్మన్ని ఆహ్వానం పలికే సమయానికి ఆకాశమంత ఎత్తు ఎదిగిన మనిషి. ఆయన కెరీర్‌లో నేనొక ముఖ్య పాత్ర పోషించానని చెప్పడం రజనీకాంత్ ఔదార్యానికి నిదర్శనం. అలాంటి వ్యక్తిని నటుడని ఎలా గుర్తిస్తాం, ఎప్పటికీ మనిషిగానే చూస్తాం. ఆయన ఎదుగుదలకు ఎవ్వరూ కారణం కాదు, ఆయన సెల్ప్ మేడ్ మేన్’ అంటూ భారతీరాజా ప్రశంసల జల్లు కురించారు. భారతీరాజాతో 16 వాయదిన్‌లై, సిగప్పు రోజక్కల్, టిక్ టిక్ టిక్‌లాంటి చిత్రాలు చేసిన కమల్‌హాసన్ మాట్లాడుతూ ‘్భరతీరాజా గొప్ప దర్శకుడు. సినిమా కళపట్ల ఆసక్తివున్న యువకులు, ఆయనవద్ద నైపుణ్యాన్ని అభ్యసించి మరో భారతీరాజాగా రావాలని కోరుకుంటున్నా’ అంటూ ఆకాంక్షించారు.