గేమ్‌కు టీమ్ 5 రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ హీరో. గ్లామర్‌తో దూసుకుపోతున్న నిక్కీగాళ్రానీ హీరోయిన్. రాజ్ జకారియాస్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న చిత్రం టీమ్ 5. ఇటీవల విడుదల టీజర్ మంచి స్కోరింగ్ చేసింది. శ్రీశాంత్ స్టైలిష్‌గా కనిపించే చిత్రంలో డైలాగులు, డ్యాన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్, కాస్ట్యూమ్స్ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని నిర్మాత చెబుతున్నారు. భారీ నిర్మాణంతో సాగుతున్న చిత్రంలో పాటల చిత్రీకరణను ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో పూర్తి చేశారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందిన చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులంతా శ్రీశాంత్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా పాత్రను తీర్చిదిద్దాం. త్వరలో సినిమాను విడుదల చేస్తున్నాం అని నిర్మాత వివరించారు. పార్లే మానే, మకరంద్ దేశ్‌పాండే తదితరులు నటించిన చిత్రానికి సంగీతం గోపీసుందర్ అందిస్తుంటే, సురేష్ గోవింద్ చిత్రానికి దర్శకత్వం వహించారు.