స్వదేశీ -రోబో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వదేశీ ఉత్పత్తుల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకూ స్వదేశీ పరిజ్ఞానం తోడవుతోంది. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ భారతీయత ఉట్టిపడేలా చిత్రాలు రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్- శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న రోబో 2 కూడా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందుతుండటం విశేషం. సహజంగా ఒక చిత్రం సూపర్‌హిట్ స్థాయి దాటిపోయాక దానికి సీక్వెల్‌గా రూపొందించే సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వున్న అతిరథ మహారథులైన సాంకేతిక నిపుణులను తెచ్చుకుంటారు. బడ్జెట్ కూడా భారీ స్థాయిలోనే నిర్ణయిస్తారు. అయితే రోబో మాత్రం ప్రస్తుతం భారతీయత పరిజ్ఞానంతోనే రూపొందుతోందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. శంకర్- రజనీకాంత్‌ల మరో కలయికలో రోబో వస్తోందీ అంటేనే దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. మొదటి సినిమా బాక్సాఫీస్‌లవద్ద రికార్డుల మోత మోగించడంతో, మరోసారి రికార్డుల మోత వినిపించేందుకు రోబో-2 సిద్ధమవుతోంది. చిత్రంపై భారీ అంచనాలు ఎప్పుడో మొదలయ్యాయి. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారతీయ చిత్రంగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తుండటం మరో విశేషం. మేకిన్ ఇండియా స్ఫూర్తితో చిత్రం తెరకెక్కడం మరో హైలెట్. భారీ బడ్జెట్ సినిమా అనగానే విదేశీ సాంకేతిక నిపుణుల దిగుమతి వుంటుంది. సినిమా చిత్రీకరణ కోసం అనేక దేశాలు చుట్టి షూటింగ్ చేస్తారు. రోబో చిత్రం కూడా అనేక విదేశీ లొకేషన్‌లలో చిత్రీకరించినదే. అయితే రోబో-2 మాత్రం మొత్తం షూటింగ్ భారతదేశంలోనే జరుపుకోవడం విశేషం. కీలకమైన సన్నివేశాలన్నీ చెన్నైలో చిత్రీకరించారు. కొన్ని ఫైట్ దృశ్యాలు ఢిల్లీలో షూటింగ్ జరిపారు. సినిమా టాకీ పూర్తయిన చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారతీయ సాంకేతిక నిపుణులే అందించనున్నారు. సహజంగా 35 ఎంఎం (2డి)లో చిత్రీకరించిన సినిమాను, ఆ తరువాత ఏ ఫర్మాట్‌లోకి కావాలంటే అందులోకి మార్చుకునే వీలుతో షూటింగ్ చేస్తారు. శంకర్ మాత్రం ఈ చిత్రాన్ని దేనికదే విడివడిగా 3డి, ఐమాక్స్ 3డి లాంటి ఫార్మాట్‌లలోనే చిత్రీకరించి సినిమా అందాన్ని పెంచే ప్రయత్నం చేశారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి వీలుగా అనేక థియేటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. అప్పట్లో చిన్నారి చేతన విడుదలైనపుడు 3డి ఫార్మాట్‌లోకి థియేటర్ స్క్రీన్‌ను మార్చిన విధంగా, ఇప్పుడు ఐమాక్స్ 3డి, ఐమాక్స్ రియల్ 3డిలలోకి వెండితెరను తర్జుమా చేస్తున్నారు. శబ్దంలో నాణ్యత కోసం ఇప్పటికే రసూల్ పుకుట్టి కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని వాడుతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయ. డాల్బీ సౌండ్ సిస్టంకన్నా వైవిధ్యంగా ఉండేందుకు ఆయన కృషి చేస్తున్నారు. సినిమా గత రోబో సినిమాకన్నా వందరెట్లు అద్భుతంగా వుండేలా దర్శకుడు శంకర్ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నారన్నది బలంగా వినిపిస్తోన్న మాట. ఈ చిత్రంలో కొన్ని దృశ్యాల చిత్రీకరణ కోసం హెలీకామ్‌లు వాడామని చెబుతోంది చిత్రబృందం. దీనివల్ల సన్నివేశాలలో నాణ్యత ఘాఢతతోపాటుగా దర్శకుడు చెప్పదలచుకున్న ఆలోచన ప్రేక్షకుడికి అర్థమవుతుంది. దాదాపు చిత్రాన్ని ఏడు భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయ. సినిమా ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చూసేయడానికి అభిమానులూ దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. దీపావళికి థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న రోబో సీక్వెల్ ఎంతవరకు ప్రేక్షకుడికి సంతృప్తినిస్తుందో చూడాలి.

-యు