సాహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి -కన్‌క్లూజన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఐదేళ్లు ఈ ప్రాజెక్టు కోసమే సమయాన్ని కేటాయించిన ప్రభాస్ కూడా కొత్త ప్రాజెక్టు కోసం దాదాపు రంగం సిద్ధం చేసుకున్నాడు. బాహుబలి విడుదలవ్వడమే తరువాయి, తరువాతి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆతృతతో చూస్తున్నాడు. బాహుబలి-కన్‌క్లూజన్ విడుదల కోసమే నేనూ చూస్తున్నా. బాహుబలితో వచ్చిన ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా తరువాతి ప్రాజెక్టునూ పట్టాలెక్కించేందుకు ఆతృతతో ఉన్నా అంటున్నాడు ప్రభాస్. మాతృ సంస్థలాంటి యువి క్రియేషన్స్ పతాకంపై సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ చిత్రం చేయబోతున్నాడు. సెట్స్‌మీదకు వెళ్లేందుకు సమయం దగ్గర పడుతుండటంతో -టైటిల్ కూడా నిర్థారించేశారు. టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్‌లో వచ్చిన క్రేజ్‌కు అనుగుణంగా చేయబోతున్న చిత్రానికి ‘సాహో’ టైటిల్ ఖరారైనట్టు చెబుతున్నారు. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్న చిత్రం ఫస్ట్‌లుక్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పేరును త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని అంటున్నాడు. ఏప్రిల్ 28న బాహుబలి విడుదల సందర్భంలో ఫస్ట్‌లుక్ బయటకు రావొచ్చని, ఆరోజే ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.