వస్తున్నాడు రాంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉంగరాల రాంబాబును మేలో థియేటర్లకు తెచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. సునీల్ సరసన మియా జార్జ్ అలరించనుంది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ ‘కమర్షియల్ హంగులతో సునీల్ మళ్లీ ఆడియన్స్ వద్దకు వస్తున్నాడు. అందాల రాముడు తరహా నవ్వించే చిత్రంగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందడం ఖాయం. ఈ ఏడాది సమ్మర్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కడుపుబ్బ నవ్వించే చిత్రంగా ఉంగరాల రాంబాబు వుంటాడనేది నమ్మకం. త్వరలో విడుదల చేస్తున్న విజువల్స్ చూస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఏ రేంజ్‌లో తెరకెక్కించామనేది అర్థమవుతుంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డబ్బింగ్ దశలో ఉంది. ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, వెనె్నల కిషోర్‌ల కాంబినేషన్‌లో సునీల్ చేసిన కామెడీ హైలెట్. అతి త్వరలో సంగీత దర్శకుడు జీబ్రాన్ అందించిన ఆడియోని విడుదల చేయనున్నాం. అశిష్ విద్యార్థి, అలీ, వెనె్నల కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధునందన్, ప్రభాస్ శ్రీను, తా.రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రంశ్రీను, సత్యం రాజేష్ తదితరులు నటించారు. పాటలు రామజోగయ్యశాస్ర్తీ, రెహమాన్, కెమెరా సర్వేష్ మురారి, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు.