సస్పెన్స్ థ్రిల్లర్.. కథకళి (హీరో విశాల్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, కేథరీన్ జంటగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘కథకళి’. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై ఘనవిజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ చిత్రాన్ని అదై టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో విశాల్ మాట్లాడుతూ, సంక్రాంతి కానుకగా 14న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది. ఇదే పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేస్తున్నామన్నారు. టైటిల్‌ను బట్టి ఇది డాన్స్ నేపథ్యంలో వున్న సినిమా అనుకునే అవకాశం ఉందని, కానీ ఇది థ్రిల్లర్ జోనర్‌లో వుండే సినిమా అని అన్నారు. ఈ ప్రయత్నం మొదటిసారి చేశానని, జాతీయ అవార్డు గ్రహీత పాండ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మర్డర్ మిస్టరీగా సాగుతుందని చెప్పారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగే కథతో అందరినీ ఆద్యంతం ఆకట్టుకుంటుందని అన్నారు. ‘వాడు-వీడు’, ‘ఇంద్రుడు’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు చేశానని, ఇందులో కూడా కొత్తతరహా పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. తప్పకుండా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందన్నారు. దర్శకుడు పాండ్యరాజ్ మాట్లాడుతూ, తమిళంలో తాను ‘పసంగ-2’, ‘కథకళి’ చిత్రాలు రూపొందించానని, ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందన్న నమ్మకం వుందన్నారు. సంగీత దర్శకుడు హిప్‌హాప్, తమీజా మాట్లాడుతూ, ఈ చిత్రంలో రెండు పాటలున్నాయని, విశాల్‌తో ఇది తన రెండవ సినిమా అని అన్నారు. ‘మగమహారాజు’ చిత్రంతో పరిచయమయ్యానని, రామచరణ్, సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో రూపొందే చిత్రానికి సంగీతం అందిస్తున్నానని అన్నారు. హీరోయిన్ కేథరీన్ మాట్లాడుతూ, తమిళంలో ఇది తన మూడవ చిత్రమని, ఈ పండక్కి విడుదలై మంచి విజయం సాధించిందని, తెలుగులో కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు మధుసూదన్, శత్రు తదితరులు పాల్గొన్నారు.