సెన్సార్‌కు తెలిసిపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ‘కన్‌క్లూజన్’ స్టోరీకి ప్రాణంలాంటి ప్రశ్న ఇది. దీనికి జవాబు నిన్నటి వరకూ జక్కన్న అండ్ టీంకు మాత్రమే తెలుసు. ఇప్పుడు -సెన్సార్‌కూ తెలిసిపోయింది. ఎందుకంటే -బాహుబలి సెన్సార్ పూరె్తైంది. ఫిల్మ్‌నగర్ సర్కిల్స్ సమాచారం ప్రకారం సెన్సార్ నుంచి యు/ఏ సర్ట్ఫికెట్ లభించినట్టు తెలుస్తోంది. పైగా సినిమా బావుందని సెన్సార్‌నుంచి జక్కన్నకు ప్రశంసలు సైతం అందాయని అంటున్నారు. అయితే, అధికారికంగా ప్రకటించకున్నా సోమవారమే సెన్సార్ పూరె్తైందని, జక్కన్న టీం దీన్ని సీక్రెట్‌గా ఉంచిందన్నది టాక్. మిగిలిన భాషల్లో సైతం సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చే వరకూ అధికారికంగా ప్రకటించకూడదని బాహుబలి టీం నిర్ణయంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్, గ్రాండియర్ విజువల్స్, ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్న చిత్రం కనుక -సినీ అభిమానులు బాహుబలికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.