ఆ దర్శకుడి కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న స్థాయి విజయం సాధించకపోవడంతో మంచి విజయాన్ని కొట్టాలనే కసితో వున్నాడు రామ్‌చరణ్. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. తమిళ హిట్ సినిమా ‘తనిఒరువన్’కు రీమేక్‌గా రూపొందే ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాతోపాటు మరో రెండు మూడు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్. ఇప్పటికే ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న మేర్లపాక గాంధీతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది. మరోవైపు క్రేజీ దర్శకుడిగా టాలీవుడ్‌లో స్టార్‌ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ప్రయత్నాల్లోనూ వున్నాడు. సుకుమార్ తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు ఓవర్‌సీస్‌లో మంచి మార్కెట్‌ను అందించాడు. దాంతో రామ్‌చరణ్ కూడా ఓవర్‌సీస్‌లో మార్కెట్ సాధించేందుకు సుకుమార్‌తో సినిమా చేయాలని భావిస్తున్నాడని
అంటున్నారు.