డేంజర్ జోన్‌లో పిశాచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో హారర్, థ్రిల్లర్ చిత్రాల పరంపర కొనసాగుతోంది. తెలుగు ఆడియన్స్‌ని భయపెట్టేందుకు పిశాచి-2గా వస్తోంది సిప్రాగౌర్. స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై సాయివెంకట్ రూపొందించిన చిత్రమిది. సినిమాకు సంబంధించిన వివరాలను నిర్మాత సాయి వెంకట్ బుధవారం మీడియాకు వెల్లడిస్తూ, కన్నడలో పెద్ద విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులోకి అనువదించి అందిస్తున్నామన్నారు. హారర్ చిత్రాలను ఎంజాయ్ చేసే తెలుగు ప్రేక్షకులు కన్నడకంటే మంచి విజయం అందిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఓ పిశాచివల్ల గ్రామ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? వాటినుంచి దుర్గామాత ఎలా కాపాడిందనే కథాంశంతో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా రూపొందించిన చిత్రమని వివరించారు. పిశాచి-2 భారీఎత్తునే విడుదల చేస్తున్నారు. తెలుగులో ‘టెన్త్‌లో’ అనే సినిమా చేశానని, హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నాని, టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని కథానాయిక సిప్రాగౌర్ వివరించింది. కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుప్రీకర్, నాగేశ్వరరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

*