అచ్చమైన తెలుగందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమర్షియల్ చట్రంలో తెలుగు సినిమా బిగుసుకుపోయిందన్న అభియోగానికి రెండు అచ్చ తెలుగు సినిమాలు తెరదించాయి. తెలుగు సినిమాకు అవార్డులొచ్చే కాలం చెల్లిందన్న అభియోగాన్ని నిజానికి చాలాకాలంగా పరిశ్రమ మోస్తోంది. కథ, కథనాలను మాస్ యాంగిల్‌లోనే రూపొందించడానికి అలవాటుపడిపోయిందన్న అభాండాన్ని మోస్తోంది. వీటికి ఇటీవల అవార్డులు సాధించిన రెండు తెలుగు చిత్రాలు చెక్‌పెట్టాయి. జాతీయ స్థాయిలో తెలుగు చిత్రానికి ఉత్తమ మాటల రచయితలాంటి అరుదైన గౌరవమూ ఈసారి దక్కడం ఆనందాతిఆనందమే. పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు, భాషకు జాతీయస్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మాండలికాన్ని సహజమైన సొంపుతో ఆవిష్కరించిందీ చిత్రం. శతమానంభవతి చిత్రం ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నిలిచి మాస్ చిత్రాల వెల్లువకు చెంపపెట్టులా నిలిచింది. ఈ రెండు చిత్రాలు తెలుగువారందరికీ ఆనందాన్నిచ్చాయి. జాతీయస్థాయిలోనే తెలుగు పరిశ్రమ ఖ్యాతిని రెపరెపలాడించాయి. తక్కువ సంభాషణలతో చక్కటి హావభావాలతో అర్థవంతంగా రూపొందించిన ఈ చిత్రాలు మంచి కథకు ఎప్పుడైనా ఆదరణ ఉంటుందని నిరూపించాయి. ఇలాంటి చిత్రాలను ధైర్యంగా రూపొందించవచ్చన్న స్వేచ్ఛనూ నిర్మాతలకు ప్రసాదించాయి. ఒకప్పుడు సిరివెనె్నల, స్వాతిముత్యం, శంకారభరణం, సిరిసిరిమువ్వ వంటి ఆహ్లాదకరమైన పేర్లతో సినిమాలు వచ్చి ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చాయి. ఇప్పుడూ అచ్చమైన తెలుగుదనంతో పెళ్లిచూపులు, సంస్కృత శ్లోకంలోని మంత్రాక్షరాల మొదటి పదం శతమానం భవతి పేరిట వచ్చిన సినిమాలు భేష్ అనిపించుకున్నాయి. మూసధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో కథాబలంవున్న చిత్రాలు జాతీయస్థాయిలో మంచి పేరుతోపాటు అవార్డులను తీసుకొస్తాయని ఈ రెండు చిత్రాలు నిరూపించినట్టే. దానికితోడు కథ, కథనాలు, సంగీతం, పాటలు లాంటివి కూడా ఆయా చిత్రాలకు మరొక మణిపూసను చేర్చాయి. విలువలతో కూడిన మంచి సినిమాలు రావడంలేదు అనేవారికి ఈ రెండు చిత్రాలు ఒక సమాధానం. పల్లెటూరి వాతావరణాన్ని పిల్లలకు, పెద్దలకు మధ్యవుండే అనుబంధాలను, భావోద్వేగాలను హృద్యంగా ఈ రెండు చిత్రాలు ఆవిష్కరించడమే సినిమా విజయాలకు కారణం.
వీటన్నిటికితోడు మరో గొప్ప విషయం -తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన సినిమాలు కావడం. చిన్న సినిమాలంటూ వస్తున్న చిత్రాలు వేలంవెర్రిగా రూపొందిస్తుంటే, ఈ రెండు చిత్రాలు మాత్రం ముక్కుసూటితనంతో సరైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే స్ఫూర్తితో కొత్తతరహా చిత్రాలు తెలుగుదనం ఉట్టిపడేలా రూపొందాలని మలయాళ, తమిళ, కన్నడ భాషా చిత్రాలు ఎన్ని జాతీయ అవార్డులు అందుకుంటున్నాయో అన్ని అవార్డులు అందుకోవాలని సినిమా ప్రియులు అభిలషిస్తున్నారు. ప్రగతిశీల భావాలతో రూపొందే ప్రయోజనాత్మకమైన, అర్థవంతమైన సినిమాలకు నాందిగా ఈ చిత్రాలు నిలవాలని, భవిష్యత్తులో ఓ వైపు తెలంగాణ ముద్రతోనూ, మరోవైపు కోనసీమ సాధికారతతో కనిపించే చిత్రాలు వచ్చి సినిమా ప్రియులను అలరించాలన్న ఆకాంక్ష ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది.

-రాజేశ్వరరావు