డేరింగ్ శ్రీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామగా దశాబ్దంపాటు సౌత్‌లో హవాచాటిన అందాల భామ శ్రీయ కెరీర్ ఈమధ్య కాస్త డల్ అయ్యింది. అయినా తరగని గ్లామర్‌తో అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది. అందంతోపాటు శ్రీయకు గట్స్ ఎక్కువేనని నిరూపించింది? అవునా.. ఎలా? అంటారా. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాల్దీవులకు హాలీడే ట్రిప్‌కు వెళ్లిందట. అక్కడ షార్క్‌లతో కలసి ఈత కొట్టింది? ‘నేను సముద్రం మధ్యలో బోట్‌లో గడిపిన లైఫ్ నా జీవితంలో అత్యంత అందమైన సమయం’ అంటూనే, అసలు వెనక్కి రావాలని అనిపించలేదని చెప్పింది. ‘ఈగల్ రే, మంటా రే, రీఫ్ షార్క్‌లను చూసాను. అంతేకాదు వాటితో కలిసి ఈత కూడా కొట్టా. రాత్రిపూట డైవింగ్ చేశా’నని చెప్పటం విశేషం. అసలు షార్క్‌లను దగ్గరగా చూడాలంటేనే భయం కలుగుతుంది. అలాంటిది శ్రీయ వాటితో కలిసి ఈతకొట్టిందంటే నిజంగా గట్స్ ఉన్నదే! గౌతమీపుత్ర శాతకర్ణిలో మురిపించిన శ్రీయ, బాలయ్య 101వ చిత్రంలోనూ అభిమానులను అలరించబోతోంది.