పాటలు పాడనున్న కొత్త కుర్రోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామ్, శ్రీప్రియ, మహేందర్, ఆశ ప్రధాన తారాగణంగా లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై మోహన్‌రావు దర్శకత్వంలో లక్ష్మణ్ పదిలం రూపొందిస్తున్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు వినా టాకీ పార్ట్ పూర్తిచేశారు. బుధవారం ఉదయం సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘అందరూ నూతన తారలతో తెరకెక్కిస్తున్న చిత్రంలో వైవిధ్యమైన పాటలు ఉంటాయి. రెండు షెడ్యూల్స్‌లో టాకీ పార్ట్ పూర్తిచేశాం’ అన్నారు. రికార్డింగ్ పూర్తయ్యాక పాటల చిత్రీకరణ జరుపుతామని, ఎంచుకున్న కథ, కథనాలపై పూర్తి నమ్మకం ఉందని, అందరికీ సినిమా నచ్చుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. చేబ్రోలు శ్రీను, జెవి రావు, యోగి తదితరులు నటించిన చిత్రానికి సంగీతం సాయి, దర్శకత్వం మోహన్‌రావు.