హత్య నేపథ్యంలో వెంకటాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్, మహిమా మక్వాన్ ప్రధాన తారాగణంగా గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై వేణు మాదికంటి దర్శకత్వంలో శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ రూపొందించిన చిత్రం ‘వెంకటాపురం’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 23న ఆడియో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆద్యంతం ఆసక్తి రేకెత్తించేలా ఈ చిత్రం రూపొందిందని, వైజాగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలోని పాటలను ఈనెల 23న విడుదల చేయనున్నామని, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో కెమెరా పనితనం హైలెట్‌గా సాగే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని వారు తెలిపారు. అజయ్, జోగిబ్రదర్స్ నటించిన ఈ చిత్రానికి కెమెరా:సాయిప్రకాష్, సంగీతం:అచ్చు, కథ, దర్శకత్వం:వేణుమాదికంటి.