బాక్స్‌లో పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగకుమార్, సునయ జంటగా పినాకి టాకీస్ పతాకంపై ఎం.ఎస్.వాసు దర్శకత్వంలో పుల్లూరి నవీన్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘బాక్స్’. నాగవంశి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్‌లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి తొలి సీడీని విడుదల చేసి దర్శకుడు వీర శంకర్‌కు అందించారు. ఈ సందర్భంగా సంగకుమార్ మాట్లాడుతూ- మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హైదరాబాద్‌కు వచ్చిన అమాయకులైన నలుగురు అబ్బాయిలు మాఫియ చేతుల్లో ఎలా చిక్కారు? వారిని ఓ పోలీసు అధికారి ఎలా కాపాడాడు అనే కథనంతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని గోవా, వరంగల్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశామని, మే రెండవ వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కొల్లేటి దామోదర్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. కిరణ్‌కృష్ణ, షాయాజీ షిండే, జీవా, ఛత్రపతి శేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:మహీ శేర్ల, పాటలు:కాసర్ల శ్యామ్, నాగరాజు, సోమిశెట్టి, శ్రీను, జయసూర్య, ఎడిటింగ్:సంతోష్, సంగీతం:నాగవంశి, నిర్మాత:పుల్లూరి నవీన్‌కుమార్, దర్శకత్వం:ఎం.ఎస్.వాసు.