సాయిలీలలు ప్రారంభమయ్యాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో కరుణామయుడుగా షిర్డీ సాయిబాబాగా ప్రేక్షకులను అలరించిన విజయ్‌చందర్, తాజాగా రాధాచిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సాయి నీ లీలలు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ ఫిలిం చాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా విజయచందర్ మాట్లాడుతూ- బాబాకు ఇన్నాళ్లకు తనపై దయ కలిగినందువల్ల భక్తులకోసం బాధ్యతగా నా చేత ఈ చిత్రం చేయిస్తున్నారని, ప్రేక్షకులకు సాయిలీలలు మహిమాన్వితంగా ఉండి నచ్చుతాయని తెలిపారు. సాయిబాబా పాత్రలో ప్రపంచమంతా గుర్తింపు పొందిన విజయచందర్ మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రంలో నటిస్తుండడం ఆనందదాయకమని ఆదిశేషగిరిరావు తెలిపారు. కార్యక్రమంలో అనంత్ శ్రీరామ్, తోటపల్లి మధు, సురేష్ కొండేటి, కాజా సూర్యనారాయణ, అనుమోలు జగన్మోహనరావు, ఎస్.సత్యనారాయణరెడ్డి, బి.సుబ్బారెడ్డి, చల్లా విజయ్, చెరుకూరి శ్రీనివాసులు, సాయిరామ్, మహిమ, కె.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.