విలన్‌గా శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజ్ తగ్గుతున్న సీనియర్ హీరోలు యు టర్న్ తీసుకుని నెగెటివ్ పాత్రలపై దృష్టి పెడుతున్నారు. విలన్లుగా ఇప్పటికే సుమన్, జగపతిబాబు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ దారిలో మరో హీరో వెళ్తున్నాడు. హీరోగా చాన్స్‌లు పూర్తిగా తగ్గిపోవడంతో శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్‌పై సీరియస్‌గానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. నాగచైతన్య నటిస్తున్న చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. విలన్‌గా తనకంటూ ఓ స్టయిల్ క్రియేట్ చేసుకోడానికి మేకోవర్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. వైవిధ్యమైన లుక్ కోసం డిఫరెంట్ స్టయిల్‌లో గెడ్డాన్ని పెంచుతున్నాడు. మోహన్‌లాల్, సుదీప్‌ల చిత్రాల్లోనూ విలన్‌గా కనిపించనున్నాడని టాక్. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా నటించిన రారా, నాటుకోడి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విలన్‌గానే కెరీర్ మొదలుపెట్టిన శ్రీకాంత్, మళ్లీ విలన్‌గా మారడం చిత్రమైన విషయమే.